కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 24 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి ఉ.10.15 కు తదుపరి ఏకాదశి 25 ప.11.52 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ 25 ఉ.06.02 కు తదుపరి జ్యేష్ఠ 26 ఉ.8.35 కు
యోగం: బ్రహ్మ రా.9:08 కు తదుపరి ఐంద్ర 25 రా.10:04 కు
కరణం: వణిజ రా.10:23 కు తదుపరి బవ 25 రా.12:46 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.31 - 9.22 కు, మ. 12.48 - 1.39 కు
వర్జ్యం: ఉ.8.09 - 9.54 కు
అమృతకాలం: సా. 04.56 - 06.44 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు
🕉️ ఆషాఢ శుక్లపక్ష దశమి, శాకంభరీమాత ఉత్సవ ఆరంభం🕉️
గురుబోధ:
ఆషాఢ శుక్ల దశమినాడు నదీస్నానం చేసినా, మంత్రజపం చేసినా, దానాలు, హోమాలు చేసినా స్వర్గసుఖాలు లభిస్తాయని ప్రత్యేకంగా స్వాయంభువ మనువు చెప్పాడు. నేడు యథాశక్తిగా అమ్మవారిని శాకంభరిగా పూజించాలి. అవకాశం ఉంటే దానధర్మాలు చెయ్యాలి. పఠించవలసిన స్తోత్రాలు - లలితాసహస్రనామపారాయణం, శ్రీసూక్తం, దుర్గాస్తోత్రం వంటివి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial