కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ మ. 12.51 కు తదుపరి తదియ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ధనిష్ఠ రా. 11.46 కు తదుపరి శతభిషం
యోగం: ఆయుష్మాన్ మ. 02.36 కు తదుపరి సౌభాగ్య
కరణం: గరజి ఉ. 10.23 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.29 - 09.21 కు & రా. 11.17 - 12.01
వర్జ్యం: తె. 4.47 - 6.17 కు
అమృతకాలం: మ. 1.54 - 3.24 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.52 కు
గురుబోధ:
ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణవిశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.
జూలై 21 నుండి ఆగష్టు 19 వరకు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాంద పురాణం ప్రవచనం శృంగేరి శారదా పీఠం(సంపత్ నగర్), గుంటూరు లో సాయంత్రం 6 నుండి 8 వరకు జరుగుతున్నది