కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి ఉ.7.58 కు తదుపరి త్రయోదశి 23 ఉ.5.53 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మృగశిర రా.7.40 కు తదుపరి ఆరుద్ర 23 రా.6.32 కు
యోగం: ధ్రువ సా.3:31 కు తదుపరి వ్యాఘాత 23 సా.12:33 కు
కరణం: తైతుల ఉ.7.06 కు తదుపరి గరజి సా.5.51 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8:30-9:22 కు, మ. 11:16-12:00 కు
వర్జ్యం: రా.3.41-5.12 కు
అమృతకాలం: ఉ.11:14-12:43 కు
సూర్యోదయం: ఉ. 5:38 కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు ఉదయం 7 గం.ల లోపు చేసెయ్యాలి.
గురుబోధ:
మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయదర్శనం, పురాణప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఎదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి.