కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: పాడ్యమి మ. 2.41 కు తదుపరి విదియ
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శ్రవణం రా. 12.58 కు తదుపరి ధనిష్ఠ
యోగం: ప్రీతి సా. 05.58 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ మ. 01.11 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.49 - 01.41 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: తె. 4.46 - 7.15 కు
అమృతకాలం: మ. 3.01 - 4.33 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
గురుబోధ:
సంమార్జనం చ కుర్వన్తి నరాయే చ శివాలయే | తే వై శివపురం ప్రాప్య జగద్వంద్యాః భవన్తి చ || (స్కాంద పురాణం, మాహేశ్వర ఖండం, అ.5, శ్లో.49)
శివాలయానికి లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి భక్తిశ్రద్ధలతో కనీసం ఒక 40 రోజులు ఆలయాన్ని తుడిస్తే, తప్పక అంత్యకాలంలో కైలాసానికి లేదా భగవత్ సన్నిధానానికి వెళ్తారు. బతికి ఉన్నంతకాలం మహా ఐశ్వర్యవంతులై, వారి జాతకదోషాలన్నీ తొలగి, పదవులు, సంపదలతో పాటు కీర్తి లభిస్తుంది. వారి పూర్వకర్మల వల్ల బ్రహ్మదేవుడు వ్రాసిన పాతరాత తొలగి మంచిరోజులు, అనేక శుభఫలితాలు వస్తాయి.