July 21 2025జులై 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి ఉ.10.12 కు తదుపరి ద్వాదశి 22 ఉ.7.58 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రోహిణి రా.9.01 కు తదుపరి మృగశిర 22 రా.7.40 కు
యోగం: వృద్ధి సా.6:38 కు తదుపరి ధ్రువ 22 సా.3:31 కు
కరణం: బాలవ ఉ.8.39 కు తదుపరి కౌలవ రా.8.22 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:48-1:39 కు, మ. 3:22-4:14 కు
వర్జ్యం: మ.1.31-3.01 కు & రా.2.17-3.47 కు
అమృతకాలం: సా.06:09-07:38 కు
సూర్యోదయం: ఉ. 5:38 కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

🕉️ ఆషాఢ బహుళ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీపారణ రేపు ఉదయం 7 గం.ల లోపు చేసెయ్యాలి.

గురుబోధ:
ఆషాఢ బహుళైకాదశిని యోగినీతిథి అని పిలుస్తారు. ఈ తిథి నాడు శివకేశవులను అర్చించిన వారు యోగశక్తి పొందుతారు. ఈ తిథినాడు చేసే ఉపవాసం వల్ల, శ్రీహరి పూజ వల్ల, సకల రోగాలు తొలగి, ఆనందమయ జీవితం లభిస్తుంది.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

expand_less