July 20 2026జులై 20 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి ఉ.7.07 కు తదుపరి సప్తమి 21 ఉ.7.06 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: హస్త రా.11.15 కు తదుపరి చిత్ర 21 రా.12.17 కు
యోగం: సిద్ధ సా.6:25 కు తదుపరి సాధ్య 21 సా.6:41 కు
కరణం: గరజి మ.3:41 కు తదుపరి విష్టి 21 సా.4:35 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 1.39 కు, మ. 3.23 - 4.14 కు
వర్జ్యం: ఉ.7.19 - 8.57 కు
అమృతకాలం: మ. 12.54 - 02.34 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

🕉️ స్కంద షష్ఠి, వారాహీ నవరాత్రులు 6వ రోజు 🕉️

గురుబోధ:
స్కంద షష్ఠి నాడు షష్ఠీదేవిని, కుమారస్వామిని వారి దివ్యానుగ్రహం కోసం పూజించవలెను. ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి. తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన,వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.

సుబ్రహ్మణ్యస్వామి అవతారఘట్టంలోని విశేషాలు👇🏻
https://youtu.be/HzagOETvUGw?si=SDsiz4vCZXuInbly
మంగళ షష్ఠి లేదా దేవసేనా స్తోత్రం👇🏻
https://youtu.be/z5AyoV476mQ?si=uiqUKBMO5yuEedpb
సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం👇🏻
https://youtu.be/KsenuKREgzY?si=4bM0iya0Uz94YnVa

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less