July 20 2025జులై 20 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి మ.12.36 కు తదుపరి ఏకాదశి 21 ఉ.10.12 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: కృత్తిక రా.10.33 కు తదుపరి రోహిణి 21 రా.9.01 కు
యోగం: గండ రా.8:47 కు తదుపరి వృద్ధి 21 సా.6:38 కు
కరణం: విష్టి మ.12.13 కు తదుపరి బవ రా.10.56 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.5:06-5:57 కు
వర్జ్యం: ఉ.11.16-12.46 కు
అమృతకాలం: రా.08.39-10.08 కు
సూర్యోదయం: ఉ. 5:38 కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

గురుబోధ:
వారణాసి కంటే అద్భుతమైన క్షేత్రం మరొకటి లేదు. కాశీ గురించి చెప్పని పురాణం, ఇతిహాసం లేదుగాక లేదు. కావ్యాలలో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు. అంతటి కాశీ అపూర్వం అక్కడ ఉపాసన చేసేవాడు, శరీరం విడిచినవాడు శివునిలో ఐక్యమైపోతాడు. కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం, శ్రీశైలం మొదలైన దివ్యక్షేత్రాల్లో ఉపాసనలు, ప్రదక్షిణలు చేయగా కాశీలో నిత్యనివాసం చేసే మహాయోగం పడుతుంది. - శ్రీ స్కాందపురాణం

expand_less