కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి సా. 5.20 కు తదుపరి పూర్ణిమ
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా. 2.25 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వైధృతి రా. 12.08 కు తదుపరి విష్కంభ
కరణం: గరజి తె. 06.54 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.52 - 07.36 కు
వర్జ్యం: మ. 12.05 - 1.40 కు
అమృతకాలం: రా. 9.49 - 11.19 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
గురుబోధ:
భూమి మీద పుట్టిన ప్రతిజీవికి కొన్ని ధర్మములు ఉన్నాయి. అందులో ఒకటి గురువును ఆశ్రయించడం. పుడమిలో మనుజులెవ్వరైనా గాని గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకిస్తే తప్ప తరించలేరు. అందుకే రాముడు, కృష్ణుడు సమస్తము ఎరిగిన వారయినప్పటికినీ, జగద్గురువులయినప్పటికినీ, పరిపూర్ణులయినప్పటికినీ గురువును ఆశ్రయించారు. ఈ జన్మల పరంపర నుండి విముక్తి పొందాలి అంటే సంపూర్ణంగా గురువు యొక్క శరణాగతిని పొందాలి. మోక్షాన్ని పొందడం అంత సులభము కాదు కానీ ఎవరైతే గురువుని, భగవంతుడిని సంపూర్ణ శరణాగతి వేడుకుంటారో వారికి మార్గం అత్యంత సులభం అవుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
జూలై 21 నుండి ఆగష్టు 19 వరకు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాంద పురాణం ప్రవచనం శృంగేరి శారదా పీఠం(సంపత్ నగర్), గుంటూరు లో సాయంత్రం 6 నుండి 8 వరకు జరుగుతున్నది