July 20 2023జులై 20 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : తదియ 21వ తేదీ తె. 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : ఆశ్లేష ఉ. 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి మఖ
యోగం : సిద్ధి ఉ. 11గం౹౹23ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  తైతుల సా. 05గం౹౹43ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : రా. 10గం౹౹58ని౹౹ నుండి 12గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 07గం౹౹53ని౹౹ నుండి 09గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

🕉️వ్యతీపాత యోగం🕉️

గురుబోధ* 
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.
పితృకార్యక్రమములు ఏ ప్రదేశం లో చేస్తే ఆ ప్రదేశం శుద్ధి చెంది పవిత్రం అవుతుంది. ఇతర దోషాలు ఏవైనా ఆ ప్రదేశం లో ఉన్నా  తొలగిపోతాయి. అందుకే  మన పెద్దలు పితృకార్యక్రమాలు, తర్పణాలు మొ౹౹ ఇంటిలోనే చేసేవారు.

expand_less