July 19 2026జులై 19 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి ఉ.7.39 కు తదుపరి షష్ఠి 20 ఉ.7.07 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తర రా.10.44 కు తదుపరి హస్త 20 రా.11.15 కు
యోగం: శివ సా.6:36 కు తదుపరి సిద్ధ 20 సా.6:25 కు
కరణం: కౌలవ మ.3:30 కు తదుపరి గరజి 20 మ.3:41 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 5.06 - 5.58 కు
వర్జ్యం: తె.5.53 - ఉ.7.29 కు
అమృతకాలం: ఉ. 10.55 - 12.32 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

🕉️ వారాహీ నవరాత్రులు 5వ రోజు, స్కంద పంచమి 🕉️

గురుబోధ:
శుక్లపక్షంలో వచ్చే పంచమి సూర్యోదయం వరకు ఉంటే ఆ పంచమిని స్కంద పంచమి అంటారు. కుమారస్వామి, శాఖుడు విశాఖుడు, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలా అనేక నామాలతో, అనేక రూపాలతో వెలిసాడు. అందులో స్కందుడు అనే పేరుతో వెలసి కొలువైనటువంటి ఒక ఆలయంలో, విగ్రహరూపం ధరించినటువంటి రోజు ఆషాఢ శుక్ల పంచమి.
ఆచరించవలసిన విధివిధానాలు
ఈ రోజు ఆవుపేడను పిడకలు చేసి కాల్చగా వచ్చిన భస్మంతో రుద్రాభిషేకం చేసి, ఆ విభూతిని శరీరానికి పూసుకొని అప్పుడు కుమారస్వామిని యథాశక్తిగా అర్చించి, చిమ్మిలి (నువ్వులు, బెల్లం కలిపిన ముద్దను) నివేదించి ప్రసాదంగా స్వీకరించిన వారికి జాతక దోషాలు అన్నీ పరిహారం అయిపోతాయి. సకలైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు షష్ఠీదేవి స్తోత్రమును పారాయణ చేయాలి. ఫలశ్రుతి: పిల్లలు ఆరోగ్యవంతులవుతారు. ఆయువు పెరుగుతుంది. సకల శుభాలు పొందుతారు. సర్పదోషాల నుండి విముక్తి పొందుతారు.

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం: https://youtu.be/KsenuKREgzY?si=4bM0iya0Uz94YnVa
షష్ఠీదేవి స్తోత్రము: https://youtu.be/z5AyoV476mQ?si=uLTFHvgm5povIJrZ

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less