July 19 2023జులై 19 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : విదియ రా. 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పుష్యమి ఉ. 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : వజ్ర ఉ. 10గం౹౹26ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  బాలవ మ. 03గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹15ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 05గం౹౹37ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

గురుబోధ* 
యజ్ఞానికి అధిష్ఠానదేవత అగ్నిదేవుడు. అగ్నిహోత్రుడు సాక్షాత్తు విష్ణువే. విష్ణువు ముఖాముఖి కనబడడు కానీ "యజ్ఞోవై విష్ణుః" అనగా అగ్నిరూపంలో కనబడుతాడు. దీపం పెడుతున్నామంటే విష్ణుమూర్తిని అక్కడ పెడుతున్నామని అర్థం. భగవద్గీతలో "అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః", నేను వైశ్వానరుడనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉన్నాను అని కృష్ణుడే స్వయంగా తాను అగ్నిని అని చెప్పాడు, పైగా అగ్నిహోత్రుడు విష్ణువుకు ముఖం. అదే విష్ణుసహస్రనామంలో "ముఖమపిదహనో" అని ఉంటుంది. అగ్ని అంటే కనబడుతున్న విష్ణువు, సూర్యుడు అంటే కనబడుతున్న నారాయణుడు. సూర్యునికి, అగ్నికి అవినాభావ సంబంధం ఉంది. సూర్యునిలో అగ్ని ఉంది, అగ్నిలో సూర్యత్వం ఉంది. కాబట్టి రోజూ విష్ణువును దర్శించాలంటే లేచీలేవగానే శుచియై సూర్యుణ్ణి దర్శించుకోవాలి. దీపారాధన చేసి ఒక పుష్పం పెట్టామంటే, విష్ణువును పూజించినట్లే. అందువలన అగ్నిని పూజించడం అంటే విష్ణువును పూజించడంతో సమానం.

expand_less