"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 19 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : షష్ఠి మధ్యాహ్నం 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : అతిగండ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹44ని౹౹ ఉంది వరకు తదుపరి సుకర్మ
కరణం : వణిజ ఉదయం 07గం౹౹49ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹ 04ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 10గం॥58ని॥ నుండి 11గం॥42ని॥ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం॥09ని॥ నుండి 02గం॥44ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
మంగళవారం చాలా పవిత్రమైన దినం. మంగళ అంటే శుభం అని కూడా అర్థం. అందుకే మంగళవారం చేసే దేవతాకార్యక్రమాలు పూజ, జపం, పారాయణము మొ౹౹ గొప్ప శుభ ఫలితాలను ఇస్తాయి. మఱియు మంగళవారం ఏ కార్యం తలపెట్టినా మళ్ళీమళ్ళీ అదే కార్యం చేస్తామని శాస్త్రం. అందుకే ఆ రోజు అప్పులు తీసుకోకూడదు.
అప్పులు తీర్చడానికి మంచిరోజు.