"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూలై 19 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 05గం౹౹54ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : అతిగండ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹44ని౹౹ ఉంది వరకు తదుపరి సుకర్మ కరణం : వణిజ ఉదయం 07గం౹౹49ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹ 04ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 10గం॥58ని॥ నుండి 11గం॥42ని॥ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 01గం॥09ని॥ నుండి 02గం॥44ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I గురుబోధ మంగళవారం చాలా పవిత్రమైన దినం. మంగళ అంటే శుభం అని కూడా అర్థం. అందుకే మంగళవారం చేసే దేవతాకార్యక్రమాలు పూజ, జపం, పారాయణము మొ౹౹ గొప్ప శుభ ఫలితాలను ఇస్తాయి. మఱియు మంగళవారం ఏ కార్యం తలపెట్టినా మళ్ళీమళ్ళీ అదే కార్యం చేస్తామని శాస్త్రం. అందుకే ఆ రోజు అప్పులు తీసుకోకూడదు. అప్పులు తీర్చడానికి మంచిరోజు.