కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి సా. 6.13 కు తదుపరి త్రయోదశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా. 2.09 కు తదుపరి మూల
యోగం: శుక్ల తె. 06.13 కు తదుపరి బ్రహ్మ
కరణం: బవ ఉ. 08.59 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.12 - 11.04 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: ఉ. 7.06 - 8.45 కు
అమృతకాలం: సా. 5.09 - 6.49 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
సద్గురువులు, జగద్గురువుల నోటి వెంబడి వచ్చే ఏ వాక్కైనా శాస్త్రసమ్మతమే. ఇక దాంట్లో ఎటువంటి సందేహానికి తావు ఉండదు. ఇందుకు తార్కాణంగా, శ్రీరాముడు అనే గోపబాలుడు తమ గురువైన గర్గాచార్యుని ఆదేశం మీద ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు కుళ్ళిపోయిన పువ్వులను సమర్పించాడు. అతడికి శ్రీకృష్ణ పరమాత్ముడు శాశ్వత గోలోకాన్ని అనుగ్రహించాడు, అటువంటి ఉత్తమగతులు కేవలం గురువాజ్ఞను ఎటువంటి ధిక్కారము లేకుండా పాటించడం వల్ల మాత్రమే దక్కాయి.