" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 18 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : పాడ్యమి రా. 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పుష్యమి పూర్తిగా ఉంది యోగం : హర్షణ ఉ. 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : కింస్తుఘ్న మ. 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు వర్జ్యం : మ. 01గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం : రా. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹46ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹37ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు గురుబోధ ఇతరుల గురించి చెడు మాటలు చెప్పే వారి కన్నా వినేవారికే ఎక్కువ పాపము.