"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 18 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : పంచమి మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : శోభన ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం : తైతుల ఉదయం 08గం౹౹54ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹40ని౹౹ నుండి 05గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
పాతవి, చినిగినవి లేదా పాడైపోయిన దేవతా చిత్రములను, పటములను
చెట్ల దగ్గర లేదా గుడిలో పెట్టడం చేయరాదు. ఎవరూ తొక్కని చోట పాతి పెట్టడం లేదా పెద్ద జలాశయాల్లో వేయడం వంటివి చేయాలి.