కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి సా. 5.54 కు తదుపరి ద్వాదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ రా. 1.18 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: శుభ ఉ. 07.05 కు తదుపరి శుక్ల
కరణం: వణిజ ఉ. 08.54 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.56 - 12.48 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 2.19 - 4.00 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
👉🕉️ ఆషాఢశుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.
గురుబోధ:
1) ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలువబడుతుంది.
2) శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి నాడు క్షీరసముద్రంలో నిద్రిస్తాడు. విష్ణువు రెండు రూపాలు ధరించి, ఒక రూపంలో క్షీరసముద్రంలో నిద్రపోతాడు. మరొక రూపంతో పాతాళంలో బలిచక్రవర్తిని అనుగ్రహిస్తాడు. ఈ రెండు రూపాలలో ఉన్న విష్ణువునూ పూజించాలి.
ఆచరించవలసిన విధివిధానాలు:
1) యథాశక్తి నారాయణపూజ చేసి, ఉపవాసం ఉండే శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి దానధర్మాలు చేసుకుని ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి పారణ చెయ్యాలి.
2) కటిక ఉపవాసాలు చేసేవారు పాపాత్ములు అవుతారు, ఆత్మహత్య చేసుకున్న వారితో సమానులవుతారు.
3) పూర్తిగా తినకుండా ఉండకూడదు, అలా అని అధికంగానూ తినకూడదు.
4) శరీర సహకారానికి ఏది పడుతుందో అటువంటిది కొద్దిగా స్వీకరించాలి.
5) ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి పూజ, స్మరణం, దానం, ధర్మం, పురాణశ్రవణం మహా ఫలితాలను ఇస్తుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX