" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య రా. 10గం౹౹13ని౹౹ వరకు తదుపరి పాడ్యమివారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : పునర్వసు తె. 04గం౹౹35ని౹౹ వరకు తదుపరి పుష్యమియోగం : వ్యాఘాత ఉ. 08గం౹౹58ని౹౹ వరకు తదుపరి హర్షణకరణం : చతుష్పాద ఉ. 11గం౹౹02ని౹౹ వరకు తదుపరి నాగరాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : మ. 03గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹37ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు
🕉️సోమవతీ అమావాస్య🕉️
గురుబోధ
ఆషాఢమాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది. సోమవతీ అమావాస్య నాడు రాహుకాలం సమయంలో శివలింగదర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం. శివపంచాక్షరీ స్తోత్రం శ్రవణం చేయడం, పారాయణం చేయడం సకలపుణ్యప్రదం.