కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా.10.06 కు తదుపరి సప్తమి 17 రా.7.54 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.09 తదుపరి ఉత్తరాభాద్ర 17 తె.4.59 కు
యోగం: శోభన ఉ.11:56 కు తదుపరి అతిగండ 17 ఉ.8:28 కు
కరణం: గరజి ఉ.8.52 కు తదుపరి వణిజ రా.8.02 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:56-12:48 కు
వర్జ్యం: ఉ.11.47-1.20 కు
అమృతకాలం: రా.12.13-01.45 కు
సూర్యోదయం: ఉ. 5:37 కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు
🕉️🌞 కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలము ప్రారంభం 🌞🕉️
పుణ్యకాలం: ఉ.5.45 - సా.5.40 కు; మహాపుణ్యకాలం: మ.3.30 - సా.5.40 కు
గురుబోధ:
ఏదైనా వ్రతం, హోమము, జపము లేదా శుభకార్యం చేసినప్పుడు కొద్దిసేపైనా పురాణప్రవచనం లేదా పురాణ పారాయణము అక్కడ జరిగితే ఆ కార్యక్రమం వల్ల సంపూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం. పురాణము ఎక్కడ జరుగుతుందో అక్కడ సకల దేవతలు అదృశ్యరూపంలో వచ్చి విని ఆశీర్వదిస్తారు. అందుకే శ్రీ రమాసత్యనారాయణస్వామి వ్రతం, సంకష్టహరగణపతి వ్రతం, వినాయకచతుర్థీ వ్రతం, అనంతపద్మనాభస్వామి వ్రతం మొ౹౹ ఏవైనా పురాణకథలు తప్పక ఉంటాయి. అందుకే ఆలయప్రతిష్ఠ లేదా 12 సం౹౹కు ఒకసారి చేసే కుంభాభిషేకం మొదలైన ఉత్సవాలలో కూడా పురాణకార్యక్రమం తప్పక ఏర్పాటు చేసేవారు.