కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి సా. 5.05 కు తదుపరి ఏకాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ రా. 11.57 కు తదుపరి అనూరాధ
యోగం: సాధ్య ఉ. 07.19 కు తదుపరి శుభ
కరణం: తైతుల ఉ. 08.01 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.27 - 09.19 కు & రా. 11.17 - 12.01 కు
వర్జ్యం: తె. 4.10 - 5.51 కు
అమృతకాలం: మ. 2.28 - 4.10 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
🕉️👉ఆషాఢ శుక్లపక్ష దశమి, శాకంభరీ అవతారం, కర్కాటక సంక్రమణం, చాక్షుష మన్వాది, దక్షిణాయనం ప్రారంభం🕉️👈
👉కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయన పుణ్యకాలము - సూర్యోదయం నుండి పగలు 11:15 వరకు
గురుబోధ:
ఆషాఢ శుక్ల దశమినాడు నదీస్నానం చేసినా, మంత్రజపం చేసినా, దానాలు, హోమాలు చేసినా స్వర్గసుఖాలు లభిస్తాయని ప్రత్యేకంగా స్వాయంభువ మనువు చెప్పాడు. నేడు యథాశక్తిగా అమ్మవారిని శాకంభరిగా పూజించాలి. అవకాశం ఉంటే దానధర్మాలు చెయ్యాలి. పఠించవలసిన స్తోత్రాలు - లలితాసహస్రనామపారాయణం, శ్రీసూక్తం, దుర్గాసూక్తం వంటివి.