కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: శు.పాడ్యమి ప.1.51 కు తదుపరి విదియ 16 ప.11.48 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి రా.12.55 కు తదుపరి ఆశ్లేష 16 రా.11.49 కు
యోగం: వజ్ర 16 తె.4:30 కు తదుపరి సిద్ధి 16 రా.1:21 కు
కరణం: బవ ఉ.11:51 కు తదుపరి తైతుల 16 రా.7:36 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.56 - 12.48 కు
వర్జ్యం: ఉ.9.49 - 11.19 కు
అమృతకాలం: మ. 03.59 - 05.26 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ ఆషాఢ మాసం ప్రారంభం, వారాహీ నవరాత్రులు ఆరంభం (గుప్త నవరాత్రులు) 🕉️
గురుబోధ:
🕉️ శ్రీ వారాహీదేవి ఆషాఢ శుక్ల పాడ్యమీ తిథి నాడు అవతారం ఎత్తారు. తెల్లని రూపములో, యౌవనములో ఉండే ఈ తల్లి, లలితాదేవికి సేనాధిపతి. భూసంబంధ వివాదాల పరిష్కారం గురించి, వ్యాపారాల అభివృద్ధి గురించి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు అనుగ్రహిస్తారు. అమ్మవారిని పూజిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల గురించి మనం కీడు తలచరాదు. అమ్మవారు అటువంటివారిని మనజోలికి రాకుండా నిర్మూలించడమే కాక మనలోని అరిషడ్వర్గాలనే అంతః శత్రువులను కూడా నిర్మూలిస్తారు. సమస్తశుభాలను ప్రసాదించి జీవితం బాగుపడేలా చేస్తారు.
🕉️ అత్యంత పవిత్రమైన వారాహీకవచాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో వినడం సర్వశుభకరం. ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు వచ్చే వారాహీనవరాత్రులలో ఈ కవచాన్ని మూడుపూటలా వింటే ఎటువంటి శత్రువైనా నశించి, సర్వకార్యదిగ్విజయం లభిస్తుంది అని స్కాందపురాణంలో దేవీభాగవత మాహాత్మ్యంలో ఉంటుంది. ఆశ్వయుజ మాసం, చైత్ర మాసం, ఆషాఢ మాసం, మాఘమాసం అనే 4 మాసాలలో వచ్చే నవరాత్రులలో (శుక్లపక్షం పాడ్యమి నుండి నవమి వరకు) వినడం, అమ్మవారి సేవ చేసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా అషాఢమాసంలో వినడం వలన ఎక్కువ ఫలితం వస్తుంది. శత్రుపీడ పెరిగిపోయినప్పుడు, అపనిందలు మీద పడుతున్నప్పుడు, కీర్తి తొలగి అప్రతిష్ఠ వస్తున్నప్పుడు, దంపతుల మధ్య భేదాలు వస్తున్నప్పుడు, దొంగల భయం, అగ్ని భయం ఉన్నప్పుడు, కొనుక్కున్న వస్తువు మనకి దక్కనప్పుడు, 3 పూటాలా ఈ కవచాన్ని వింటే కష్టాలన్నీ తొలగి అనుకున్న పనులు అవుతాయి, వారాహీమాత రక్షణ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది.
https://youtu.be/ECa8o_0ig1k?si=4OAb8QAD8iwAfB3i
PDF👉🏻 - https://srivaddipartipadmakar.org/stotram/sri-varahi-kavacham/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial