కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి రా.12.03 కు తదుపరి షష్ఠి 16 రా.10.06 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శతభిషం ఉ.7.15 కు తదుపరి పూర్వాభాద్ర 16 ఉ.6.09 కు
యోగం: సౌభాగ్య సా.2:12 కు తదుపరి శోభన 16 ఉ.11:56 కు
కరణం: కౌలవ ఉ.11.21 కు తదుపరి తైతుల రా.10.39 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:29-9:21 కు, మ. 11:15-12:00 కు
వర్జ్యం: మ.1.21-2.52 కు
అమృతకాలం: రా.9.59-11.33 కు
సూర్యోదయం: ఉ. 5:37 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు
🕉️🌞 కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలము ప్రారంభం 🌞🕉️
పుణ్యకాలం: ఉ.5.45 - సా.5.40 కు; మహాపుణ్యకాలం: మ.3.30 - సా.5.40 కు
గురుబోధ:
సంసారమే పెద్దసముద్రం. లోభమే పెద్దమొసలి, మాయలా పట్టుకుని మనల్ని పతనం అయ్యేలా చేస్తుంది. అవిద్య, అజ్ఞానాలు పెరిగేలా చేస్తుంది. ఏకాదశి, సంక్రాంతి, మాసశివరాత్రి, పూర్ణిమ రోజుల్లో గురువుల, మహానుభావుల దర్శనం చేసుకుంటే లోభమనే మొసలి విడిచిపెడుతుంది.