కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: నవమి మ. 3.50 కు తదుపరి దశమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి రా. 10.09 కు తదుపరి విశాఖ
యోగం: సిద్ధ ఉ. 07.00 కు తదుపరి సాధ్య
కరణం: బాలవ తె. 06.26 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 01.41 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: తె. 4.10 - 5.53 కు
అమృతకాలం: మ. 12.34 - 2.18 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
గురుబోధ:
కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావాల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం చేసే వారికి భగవంతుడే శుభఫలితాలు తప్పక ఇస్తాడు.