July 14 2026జులై 14 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 14 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య సా.4.07 కు తదుపరి శు.పాడ్యమి 15 మ.1.51 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు రా.2.16 కు తదుపరి పుష్యమి 15 రా.12.55 కు
యోగం: హర్షణ ఉ.8:04 కు తదుపరి వజ్ర 15 తె.4:30 కు
కరణం: నాగ మ.3:13 కు తదుపరి బవ 15 ఉ.11:51 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.29 - 9.20 కు, రా. 11.15 - 12.00 కు
వర్జ్యం: మ. 3.03 - 4.33 కు
అమృతకాలం: రా. 10.01 - 11.26 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు

🕉️ జ్యేష్ఠ అమావాస్య 🕉️

గురుబోధ:
భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం  కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి. స్వర్గస్థులైన వారు ఎవ్వరైనా సరే (బంధువులు, స్నేహితులు), వారి పేరు మీద స్వయంపాకం (వంట సరుకులు, కూరగాయలు) బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. పితృతర్పణాలు అర్హత కలిగిన వారు మాత్రమే ఇవ్వాలి. స్వయంపాకం ఎవ్వరైనా ఇవ్వవచ్చు.

అమావాస్య కథ👇🏻
https://youtu.be/OBwT8oxE1z4?si=NjzSGO5jAJTxoojy

పితృ దేవతా స్తోత్రం
https://youtu.be/UgnxFM4YHYY?si=xlMG7zDtuOiFaZLX

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less