July 14 2024జులై 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి మ. 2.11 కు తదుపరి నవమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: చిత్త రా. 7.57 కు తదుపరి స్వాతి
యోగం: శివ తె. 06.16 కు తదుపరి సిద్ధ
కరణం: బవ మ. 05.25 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 05.10 - 06.02 కు
వర్జ్యం: రా. 2.03 - 3.48 కు
అమృతకాలం: మ. 12.42 - 2.28 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు

👉🕉️ వారాహీ నవరాత్రులు 9వ రోజు 🕉️👈

గురుబోధ:
ఆషాఢమాసం తప్పక గోరింటాకు పెట్టుకోవాలని శాస్త్రం. నిత్యం గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మికపరంగా అమ్మవారికి ప్రీతికర్మే కాక ఆయుర్వేదపరంగా కూడా మంచిది.
అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అష్టమి నాడు చేసే ఈశ్వర అరాధన, అమ్మవారి అర్చన మరింత విశేషశుభఫలితాలనిస్తుంది.
ఆదివారం అష్టమీతిథి నాడు కాలభైరవుని పూజించినా, కాలభైరవాష్టకం విన్నా, చదివినా అనేక జన్మ పాపసంహరణమై, విశేషశుభాలు లభిస్తాయి.

expand_less