కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 13 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి సా.6.32 కు తదుపరి అమావాస్య 14 సా.4.07 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర 14 తె.3.49 కు తదుపరి పునర్వసు 14 రా.2.16 కు
యోగం: వ్యాఘాత ఉ.11:56 కు తదుపరి హర్షణ 14 ఉ.8:04 కు
కరణం: శకుని సా.6:50 కు తదుపరి నాగ 14 మ.3:13 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.47 - 1.39 కు, మ. 3.23 - 4.14 కు
వర్జ్యం: మ.1.17 - 2.47 కు
అమృతకాలం: సా. 06.01 - 07.26 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ మాసశివరాత్రి 🕉️
🕉️ ఆరుద్రా నక్షత్రం , సోమవారం మరియు మాస శివరాత్రి కలవడం అలభ్య యోగం, ఎంతో విశేషం. 🕉️
గురుబోధ:
🕉️శివపత్రి లేదా శివ నిర్మాల్యం ఏమి చేయాలి?
శివుని ఆలయలంలో ఇచ్చిన పత్రి నందీశ్వరుని మీద పెట్టాలి. ఎందుకంటే అది మహా శక్తిమంతమైనది, దానిని మోసే శక్తి మనకి లేదు. అందుకే ఈశ్వరుని మీద పెట్టిన బిల్వపత్రమో, దళమో, పుష్పమో మనకిస్తే అవి కళ్ళకద్దుకుని వినయముగా నందీశ్వరుని మీద పెట్టాలి. శివ ప్రసాదాన్ని పొరపాటున కూడా తిరస్కరించకూడదు. కనీసం ఒక్క మెతుకైనా తీసుకోమన్నారు. పండు ఇస్తే, తీర్థమిస్తే కొంచమైనా దానిని స్వీకరించమన్నారు. కొబ్బరికాయ విషయంలో మాత్రం పూర్తిగా అర్చకస్వామిదే బాధ్యత. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ రెండు చిప్పలు అర్చకస్వామివే. ఆయన తనంత తాను ఇస్తేనే మనం పుచ్చుకోవాలి. ఒకవేళ ఇవ్వకుంటే మనం అడిగి తీసుకోకూడదు. తక్కిన ఆలయములలో ఒక చిప్ప మనం అడిగి పుచ్చుకోవచ్చు. - శ్రీ శివమహాపురాణం
🕉️సోమవారం ప్రదోషవేళ మాసశివరాత్రిరోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను అనుగ్రహిస్తుంది.
శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-siva-sahasranama-stotram/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial