July 13 2023జులై 13 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి రా. 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : కృత్తిక రా. 11గం౹౹09ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : శూల ఉ. 08గం౹౹53ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  బవ ఉ. 06గం౹౹08ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹47ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 11గం౹౹05ని౹౹ నుండి 12గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹44ని౹౹ నుండి 10గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు

🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేయాలి.

గురుబోధ 
ఆషాఢ బహుళైకాదశిని యోగినీతిథి అని పిలుస్తారు. ఈ తిథి నాడు శివకేశవులను అర్చించిన వారు యోగశక్తి పొందుతారు. ఈ తిథినాడు చేసే ఉపవాసం వల్లా, శ్రీహరి పూజ వల్లా, సకల రోగాలు తొలగి, ఆనందమయ జీవితం లభిస్తుంది.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె, కవయిత్రి శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )

expand_less