"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 13 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : పూర్ణిమ రాత్రి 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 12గం౹౹26ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ఐంద్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : విష్టి మధ్యాహ్నం 02గం౹౹04ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 11గం౹౹03ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 07గం౹౹58ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
👉🏻🕉️గురుపూర్ణిమ🕉️
గురుబోధ
ఈ రోజు వ్యాసభగవానుని పూజ మఱియు వ్యాస స్వరూపులైన గురువుగారి దర్శనం, ప్రదక్షిణలు, పూజ, జపం, నామస్మరణం, భజనలు, గురుచరిత్ర శ్రద్ధగా పారాయణం చేయడం వలన అనేక శుభఫలితాలు పొందుతారు అని శాస్త్రం.