కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రా.9.00 కు తదుపరి చతుర్దశి 13 సా.6.32 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రోహిణి ఉ.7.08 కు, మృగశిర 13 తె.5.28 కు తదుపరి ఆర్ద్ర 14 తె.3.49 కు
యోగం: వృద్ధి రా.8:05 కు తదుపరి వ్యాఘాత 13 ఉ.11:56 కు
కరణం: గరజి మ.12:19 కు తదుపరి శకుని 13 సా.6:50 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 5.06 - 5.58 కు
వర్జ్యం: ప.12.20 - 1.49 కు
అమృతకాలం: రా. 09.54 - 11.19 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ప్రదోషం🕉️
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20 ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial