కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి ఉ. 10.18 కు తదుపరి సప్తమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర మ. 2.54 కు తదుపరి హస్త
యోగం: పరిఘ 13 తె. 05.15 కు తదుపరి శివ
కరణం: తైతుల మ. 12.32 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.26 - 09.19 కు & మ. 12.48 - 01.40 కు
వర్జ్యం: రా. 12.13 - 1.59 కు
అమృతకాలం: ఉ. 6.55 - 8.41 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ వారాహీ నవరాత్రులు 7వ రోజు 🕉️👈
గురుబోధ:
సృష్టిలో రహస్యం ఏమిటంటే భగవంతుడు అనేక రూపములతో ఉంటాడు. ఏవిధమైన భ్రమా లేకుండా చేస్తాడు. అమ్మవారికి ఇష్టమైన మాసాలలో అయ్యవారికి ఉత్సవాలు జరుగుతాయి, అలానే అయ్యవారికి ఇష్టమైన మాసాలలో అమ్మవారికి పూజలు, వ్రతాలు నిర్వహించబడతాయి. అమ్మైనా, అయ్యైనా, శివుడైనా, కేశవుడైనా ఉన్నది ఒకటే శక్తి. "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" ఒకటే పరబ్రహ్మ రెండోది లేదు. "ఏకో దేవ కేశవో వా శివోవ" అని ఉపనిషత్ వాక్యం, శివుడైనా కేశవుడైనా ఏ రూపంతో వర్ణించినా, ఏ నామంతో పిలిచినా, ఉన్నది ఒకడే దేవుడు. అది జ్ఞానంతో కనిపెడితే ఆయన అనేక రూపాలతో దర్శనం ఇస్తాడు. ‘కాలం’ కూడా శ్రీకృష్ణుడి స్వరూపమే.