" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము
తిథి : దశమి రా. 08గం౹౹46ని౹౹ వరకు తదుపరి ఏకాదశివారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : భరణి రా. 11గం౹౹01ని౹౹ వరకు తదుపరి కృత్తికయోగం : ధృతి ఉ. 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి శూలకరణం : వణిజ ఉ. 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి విష్టిరాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹47ని౹౹ నుండి 10గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం : సా. 06గం౹౹16ని౹౹ నుండి 07గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు
గురుబోధ
శాసనము అంటే అదుపులో పెట్టుట , తనను తాను అదుపులో పెట్టుకోవడం. ఇతరులను అదుపులో పెట్టడాన్ని అనుశాసనం అంటారు. సాధారణంగా ఏ వ్యక్తికైనా ఆ క్షణమే కోపం వచ్చే లక్షణం ఉందనుకుంటే, తనను తాను ఆ కోపాన్ని ఎలా జయించాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలి అని ఆలోచించి కోపాన్ని జయిస్తే తనను తాను అనుశాసనం పొందినట్లే, కోరికలను అదుపులో పెట్టుకోగలిగితే అది అనుశాసనమే. బాగా పిసినారితనంతో డబ్బు నేను మాత్రమే సంపాదించాలి అని ధనం మీద కోరిక కలిగినప్పుడు ఈ ధనలోభాన్ని జయించగలిగితే వాడు కూడా అనుశాసనకుడు అవుతాడు. నా కుటుంబం , నా పదవి , నా ఆస్తి అని దాని మీద వ్యామోహం పెంచుకోకుండా వ్యామోహం వలన ప్రమాదం వస్తుందని తెలుసుకుని, ఆ వ్యామోహాన్ని చంపుకోవడానికి అనగా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యడం అనుశాసనం. - శ్రీ మహాభారతం