కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి ఉ. 8.21 కు తదుపరి షష్ఠి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుబ్బ మ. 12.19 కు తదుపరి ఉత్తర
యోగం: వరీయాన్ 12 తె. 04.09 కు తదుపరి పరిఘ
కరణం: బాలవ ఉ. 10.03 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.11 - 11.03 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: రా. 8.17 - 10.03 కు
అమృతకాలం: తె. 5.30 - 7.02 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ వారాహీ నవరాత్రులు 6వ రోజు 🕉️👈
గురుబోధ:
నిన్న ఎక్కువ సమయం పంచమి ఉన్నది కాగా నేడు సూర్యోదయానికి ఇంకా పంచమి ఉన్నందున నేడు కూడా షష్ఠీదేవి, కుమారస్వామి యొక్క దివ్యానుగ్రహం కోసం పూజించవచ్చును. కుమారస్వామి, శాఖుడు విశాఖుడు, స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలా అనేక నామాలతో, అనేక రూపాలతో వెలిసాడు. అందులో స్కందుడు అనే పేరుతో వెలసి కొలువైనటువంటి ఒక ఆలయంలో, విగ్రహ రూపం ధరించినటువంటి రోజు ఆషాఢ శుక్ల పంచమి.
ఆచరించవలసిన విధివిధానాలు
ఈ రోజు ఆవు పేడను పిడకలు చేసి కాల్చగా వచ్చిన భస్మంతో రుద్రాభిషేకం చేసి, ఆ విభూతిని శరీరానికి పూసుకొని అప్పుడు కుమారస్వామిని యథాశక్తిగా అర్చించి, నువ్వులు, బెల్లం కలిపిన ముద్దను నివేదించి ప్రసాదంగా స్వీకరించిన వారికి జాతక దోషాలు అన్నీ పరిహారం అయిపోతాయి. సకలైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు షష్ఠీదేవి స్తోత్రమును పారాయణ చేయాలి.
ఫలశ్రుతి: పిల్లలు ఆరోగ్యవంతులవుతారు. ఆయువు పెరుగుతుంది. సకల శుభాలు పొందుతారు. సర్పదోషాల నుండి విముక్తి పొందుతారు.
షష్ఠీదేవి స్తోత్రము: https://youtu.be/z5AyoV476mQ?si=uLTFHvgm5povIJrZ