July 11 2023జులై 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : నవమి రా. 09గం౹౹50ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : అశ్విని రా. 11గం౹౹18ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : సుకర్మ ఉ. 10గం౹౹53ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  తైతుల ఉ. 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹26ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹19ని౹౹ నుండి 05గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹35ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు


గురుబోధ 
మంత్ర జపం, దీక్షలు చేసేవారు ఆ మంత్ర దేవత యొక్క పురాణకథలు, విశేషాలు భక్తితో తెలుసుకుంటే ఆ మంత్రం మరింత త్వరగా సిద్ధిస్తుందని శాస్త్రం. ఉదా౹౹ వ్యూహలక్ష్మీ మంత్ర జపం చేసేవారు ఆ అమ్మవారి చరిత్ర గల పురాణము, మంత్రం చేసి సిద్ధి పొందిన భక్తుల చరిత్ర లేదా ఇతర పురాణములను దీక్షాసమయంలో వినడం ద్వారా మంత్రదేవతానుగ్రహం పొందగలము.

expand_less