కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి రా.1.55 కు తదుపరి ద్వాదశి 11 రా.11.26 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి ఉ.10.29 కు తదుపరి కృత్తిక 11 ఉ.8.43 కు
యోగం: శూల తె.3:50 కు తదుపరి గండ 11 రా.12:05 కు
కరణం: బవ సా.6:53 కు తదుపరి కౌలవ 11 మ.3:46 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.28 - 9.19 కు, మ. 12.47 - 1.39 కు
వర్జ్యం: రా.9.36 - 11.05 కు
అమృతకాలం: ఉ. 08.46 - 10.15 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి (అపర ఏకాదశి) - ఏకాదశీ ఉపవాసం శుక్రవారం ఉండాలి. ద్వాదశీ పారణ శనివారం చేయాలి.🕉️
గురుబోధ:
🕉️ ఈరోజు నారాయణుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించాలి.
🕉️ లక్ష్మీదేవికి అపర అని పేరు. అపర అనగా భూలోక సుఖములు, పైలోక సుఖములు ఇచ్చునది, అంతకంటే ఉత్తమమైన జగన్మాత మరొకటి లేదు.
🕉️ మందార పుష్పములతో అపరాదేవిని పూజిస్తే అటువంటి వారికి సంపదలు లభిస్తాయి, మల్లె పువ్వుల వంటి తెల్లని పువ్వులతో పూజిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది, చామంతి పువ్వులతో లక్ష్మీనారాయణ అష్టోత్తరములతో పూజించినవారికి భూసంపద, గృహ సంపద, అన్ని సంపదలు కలుగుతాయి.
🕉️ఈ తిథి నాడు ఉపవసించి, ద్వాదశి నాడు వామనావతారంలో ఉన్న విష్ణువును పూజించి, విప్రునకు భోజనం పెట్టినవాడు సకలపాప విముక్తుడై వైకుంఠం పొందుతాడు. యథావిధిగా స్నానం ఆచరించి ఉపవాసం ఉండి భగవంతుని దర్శనం చేసుకోవాలి. దానధర్మాలు చేయడం చాలా మంచిది. ఈ రోజు నారాయణుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించాలి. గురుధ్యానం, గురుస్మరణం సకలశుభఫలితాలనిస్తుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial