July 10 2023జులై 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : అష్టమి రా. 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : రేవతి రా. 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : అతిగండ మ. 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  బాలవ ఉ. 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹33ని౹౹ నుండి 02గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹44ని౹౹ నుండి 11గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹35ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు


గురుబోధ 
పూర్వం ధర్మాత్ముడు అయిన మిత్రసహుడు (కల్మాషపాదుడు) అనే రాజు వేటకు వెళ్లి నర్మదా నదము మరియు అక్కడ ఉన్న అమరకంఠకము అనే పర్వత వైశిష్ట్యం తెలియక  వాటిని విమర్శించాడు. ఆ పాప కర్మ ఫలితంగా తరువాతి రోజులలో గురువుగారయిన వశిష్ఠుని శాపం పొంది కల్మాషపాదుడు అయ్యాడు. చివరికి రాక్షసుడై గంగా జల ప్రోక్షణ వల్ల శాపం నుండి విముక్తి పొందగలిగాడు. ఇన్ని కష్టాలకు కారణం కేవలం మహాత్ములను, క్షేత్రాలను, నదులను, గురువులను, నిందించడం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో విమర్శించరాదు. చిన్నచూపు చూడరాదు. - శ్రీ నారదమహాపురాణము

expand_less