కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి ఉ.5.55 కు , దశమి 10 తె.4.32 కు తదుపరి ఏకాదశి 10 రా.1.55 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అశ్విని ఉ.11.22 కు తదుపరి భరణి 10 ఉ.10.29 కు
యోగం: ధృతి ఉ.7:14 కు తదుపరి శూల 10 తె.3:50 కు
కరణం: వణిజ రా.9:32 కు తదుపరి బవ 10 సా.6:53 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.11 - 11.03 కు, మ. 3.22 - 4.14 కు
వర్జ్యం: ఉ.7.31 - 9.03 కు, రా.8.37 - 10.09 కు
అమృతకాలం: ఉ. 08.02 - 09.34 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
గోసేవ చేసి, గోవును సంరక్షించిన దిలీప మహారాజుకు రఘువు అనే ఉత్తమ కుమారుడు జన్మించాడు. అతని పేరు మీద ఇక్ష్వాకు వంశస్థులకు రఘువంశం అని పేరు వచ్చింది. గోసేవ అంత గొప్పది. గోమాత పొందే తృప్తి మనకు ఉన్న ఎన్నో జన్మల పాపాలను, అనేక దోషాలను, పితృదోషాలను కూడా తొలగిస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial