"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూలై 09 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి : దశమి ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : స్వాతి ఈ రోజు ఉదయం 07గం౹౹29ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం : సిద్ధ ఈ రోజు ఉదయం 06గం౹౹49ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : గరజి సాయంత్రం 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹51ని౹౹ నుండి 02గం౹౹23ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 10గం౹౹03ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹35ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I 👉🏻🕉️ శాకంభరీ దేవి జన్మ తిథి🕉️ గురుబోధ ప్రతిరోజూ ఏదో ఒక మంచి పనిచేయకుండా సమయాన్ని వ్యర్థంగా వెళ్లబుచ్చరాదు, నిద్రించరాదు. అంటే మంచి పుస్తకాలు, పురాణములు చదవడం, పారాయణం చేయడం, జపం చేయడం, ఆలయమునకు వెళ్లడం, ఇతరులకు సహాయం చేయడం, అన్నదానం, మంచి విషయాలు చర్చించడము, పెద్దలకు సేవ చేయడం మొ౹౹ ఏవో ఒకటి చేయాలి.