కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి ఉ.7.36 కు తదుపరి నవమి 9 ఉ.5.55 కు , దశమి 10 తె.4.32 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రేవతి మ.12.17 కు తదుపరి అశ్విని 9 ఉ.11.22 కు
యోగం: సుకర్మ ఉ.10:11 కు తదుపరి ధృతి 9 ఉ.7:14 కు
కరణం: కౌలవ మ.12:22 కు తదుపరి వణిజ 9 రా.9:32 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.55 - 12.47 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 01.37 - 03.11 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
🕉️ బుధాష్టమి 🕉️
గురుబోధ:
🕉️బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం ద్వారా రాజయోగం, గృహయోగం కలుగుతుంది. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.
🕉️బుధాష్టమీ వ్రతం ఆచరించడం కుదరని పక్షంలో కనీసం వ్రత కథ వినడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
బుధాష్టమీ వ్రత కథ 👇🏻
https://youtu.be/U4KPeiHGdlE?si=AB8OsHrNtTooJZRd
బుధాష్టమీ వ్రత విధానం 👇🏻
https://youtube.com/shorts/vJa8J26hupA?si=-uCZB0IvT9g7jWcU
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial