కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: తదియ 9 తె. 5.20 కు తదుపరి చతుర్థి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పుష్యమి ఉ. 6.12 కు తదుపరి ఆశ్లేష
యోగం: వజ్ర రా. 02.06 కు తదుపరి సిద్ధి
కరణం: తైతుల మ. 05.29 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.48 - 01.40 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: రా. 7.52 - 9.35 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.48 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ వారాహీ నవరాత్రులు 3వ రోజు 🕉️👈
గురుబోధ:
సదాచారాలను పాటించేవారు దేవతలకు, పితృదేవతలకు ప్రీతిపాత్రులు అవుతారు. అశౌచకాలంలో సరైన నియమాలను పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహము పొందలేము. ఉదా౹౹ మృతాశౌచం ఉన్న రోజులలో లేదా స్త్రీలు బయట ఉన్న రోజులలో అగ్నిని తాకడం, దేవతామూర్తులను, ఇంటిలో అన్ని వస్తువులను తాకడం, వంట చేయడం, అందరినీ కలుపుకోవడం చేయరాదు. ఇటువంటి తప్పులు చేసి ఎన్ని ప్రదక్షిణలు, జపాలు, హోమాలు, దానధర్మాలు చేసినా దేవతల అనుగ్రహం కలుగదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆచారములు పాటించాలి. అవే మన పిల్లలని, భవిష్యత్ తరాలని కాపాడుతాయి.