కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 07 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి ఉ.8.36 కు తదుపరి అష్టమి 8 ఉ.7.36 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.12.46 కు తదుపరి రేవతి 8 మ.12.17 కు
యోగం: అతిగండ మ.12:37 కు తదుపరి సుకర్మ 8 ఉ.10:11 కు
కరణం: బవ మ.1:25 కు తదుపరి కౌలవ 8 మ.12:22 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.27 - 9.19 కు, రా. 11.15 - 11.59 కు
వర్జ్యం: రా.12.31 - 2.05 కు
అమృతకాలం: ఉ. 11.31 - 01.08 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
యోగీశ్వరుడయిన శ్రీకృష్ణుడే "శ్రీమద్భాగవతం". భాగవత మహిమలేని పురాణం లేదు. మానవునిలో సమస్తపాపాలను పటాపంచలు చేసి భగవత్ భక్తిని ప్రకాశింపజేసే "సుదర్శనం" శ్రీమద్భాగవతం. మానవ జీవితంలోని భయంకర దారిద్ర్య దుఃఖాలను పారద్రోలే "రుక్మిణీకృష్ణస్వరూపం" శ్రీమద్భాగవతం. ఒక్క భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడి వంశంలో 21 తరాలు పూర్వం, మరియు రాబోయే 21 తరాలు అంతా వైకుంఠానికి వెళ్తారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial