కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ 8 తె. 4.25 కు తదుపరి తదియ
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి పూర్తి గా ఉన్నది
యోగం: హర్షణ రా. 02.13 కు తదుపరి వజ్ర
కరణం: బాలవ సా. 04.38 కు తదుపరి కౌలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 05.10 - 06.02 కు
వర్జ్యం: మ. 1.29 - 3.09 కు
అమృతకాలం: రా. 11.29 - 1.10 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ ఆషాఢ శుద్ధ విదియ, పురి జగన్నాథ రథయాత్ర, వారాహీ నవరాత్రులు 2వ రోజు 🕉️👈
గురుబోధ:
ఆషాఢ విదియ రోజు జగన్నాథపురి ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. అత్యద్భుతమైన జగన్నాథ ఆలయం ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్పబలం వల్ల ఏర్పడింది. గజేంద్రమోక్షణంలో గజరాజుగా ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజే. ఆయన్ని అనుగ్రహించి జగన్నాథపురం అనే ఒక ఊరును మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్ర తీరంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడయ్యాడు. జగన్నాథుడు సుభద్ర, బలరాముడితో కొలువై ఉంటాడు. ఈ పరమపవిత్రమైన రోజున ఏదైనా ఒక ఆలయంలో కానీ లేదా మహానుభావులుండే స్థలానికి కానీ వెళ్లి చీపురుకట్ట పట్టుకొని ఊడవాలి. నేలని శుభ్రం చెయ్యాలి. గురుసేవ, మహాత్ములసేవ, ఆలయసేవ, సేవకుడు లాగా, దాసుడి లాగా, ఒక కింకరుడి లాగా చెయ్యాలి. అలా చేసినవారు మహా ఐశ్వర్య సంపన్నులవుతారు.
https://www.youtube.com/watch?v=By5udxRz2AI&list=PLfgDt5ZsV1JJekFsopEXyHLNKbtAaRJzS