కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి 7 తె. 3.56 కు తదుపరి విదియ
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పునర్వసు 7 తె. 5.09 కు తదుపరి పుష్యమి
యోగం: వ్యాఘాత రా. 02.47 కు తదుపరి హర్షణ
కరణం: కింస్తుఘ్న సా. 04.22 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 05.47 - 07.32 కు
వర్జ్యం: సా. 4.54 - 6.28 కు
అమృతకాలం: రా. 2.34 - 4.02 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ ఆషాఢమాసం, వారాహీ నవరాత్రులు ప్రారంభం 🕉️👈
https://youtu.be/KrZ3Or9t9B4
గురుబోధ:
శ్రీ వారాహీదేవి ఆషాఢ శుక్ల పాడ్యమీ తిథి నాడు అవతారం ఎత్తారు. తెల్లని రూపములో, యవ్వవనములో ఉండే ఈ తల్లి, లలితాదేవికి సేనాధిపతి. భూసంబంధ వివాదాల పరిష్కారం గురించి, వ్యాపారాల అభివృద్ధి గురించి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు అనుగ్రహిస్తారు. అమ్మవారిని పూజిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల గురించి మనం కీడు తలచరాదు. అమ్మవారు అటువంటివారిని మనజోలికి రాకుండా నిర్మూలించడమే కాక మనలోని అరిషడ్వర్గాలనే అంతః శత్రువులను కూడా నిర్మూలిస్తారు. సమస్తశుభాలను ప్రసాదించి జీవితం బాగుపడేలా చేస్తారు.