కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా.8.18 కు తదుపరి ఏకాదశి 6 రా.10.21 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: స్వాతి రా.8.00 కు తదుపరి విశాఖ 6 రా.10.37 కు
యోగం: సిద్ధ రా.8:35 కు తదుపరి సాధ్య 6 రా.8:27 కు
కరణం: గరజి సా.6.59 కు తదుపరి వణిజ 6 ఉ.8.09 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:34 - 8:26 కు
వర్జ్యం: రా.2.13 - 3.59 కు
అమృతకాలం: ఉ. 9:56 - 11:44 కు
సూర్యోదయం: ఉ. 5:33 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు
🕉️ ఆషాఢ శుక్లపక్ష దశమి, శాకంభరీమాత ఉత్సవ ఆరంభం🕉️
గురుబోధ:
ఆషాఢ శుక్ల దశమినాడు నదీస్నానం చేసినా, మంత్రజపం చేసినా, దానాలు, హోమాలు చేసినా స్వర్గసుఖాలు లభిస్తాయని ప్రత్యేకంగా స్వాయంభువ మనువు చెప్పాడు. నేడు యథాశక్తిగా అమ్మవారిని శాకంభరిగా పూజించాలి. అవకాశం ఉంటే దానధర్మాలు చెయ్యాలి. పఠించవలసిన స్తోత్రాలు - లలితాసహస్రనామపారాయణం, శ్రీసూక్తం, దుర్గాసూక్తం వంటివి.
https://youtu.be/reVyMzCbdpE?si=6UCgCiBZeMJhiXWf
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial