July 05 2024జులై 05 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య 6 తె. 3.59 కు తదుపరి పాడ్యమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆర్ద్ర 6 తె. 4.31 కు తదుపరి పునర్వసు
యోగం: ధ్రువ 6 తె. 03.49 కు తదుపరి వ్యాఘాత
కరణం: చతుష్పాద మ. 04.38 కు తదుపరి నాగ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.24 - 09.17 కు & మ. 12.47 - 01.40 కు
వర్జ్యం: మ. 12.49 - 2.25 కు
అమృతకాలం: సా. 6.14 - 7.50 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు

👉🕉️ జ్యేష్ఠ అమావాస్య 🕉️👈

గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం  కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి. స్వర్గస్తులైన వారు ఎవ్వరైనా సరే (బంధువులు, స్నేహితులు), వారి పేరు మీద తర్పణాలు, స్వయంపాకం (వంట సరుకులు, కూరగాయలు) బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. పితృతర్పణాలు అర్హత కలిగిన వారు మాత్రమే ఇవ్వాలి. స్వయంపాకం ఎవ్వరైనా ఇవ్వవచ్చు.

https://youtu.be/UgnxFM4YHYY?si=FLxCWw0f7qUuZXtE

expand_less