July 05 2022జూలై 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 05 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  షష్ఠి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ వరకు తదుపరి సప్తమి
 వారం : భౌమవారము (మంగళవారం)
 నక్షత్రం : పుబ్బ  ఈ రోజు ఉదయం 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి ఉత్తర
 యోగం :  వ్యతీపాత  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹16ని౹౹ వరకు తదుపరి వరీయాన్
 కరణం  : కౌలవ  ఉదయం 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి తైతుల
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹43ని౹౹ నుండి04గం౹౹22ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  12గం౹౹36ని౹౹ నుండి  05గం౹౹15ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

👉🏻🕉️షష్ఠి 🕉️


గురుబోధ

ఒకే పళ్ళెంలో ఇద్దరు, ముగ్గురు కలసి భోజనం చేయడం లేదా చెంబు లోని నీళ్లు త్రాగడం చేయరాదు. ఇలా చేస్తే ఒకరి ఎంగిలి మరొకరు తిన్నట్లు అవుతుంది. ఎంగిలి పదార్థాలు ఎక్కడ ఉంటాయో లేదా ఎవరు తింటారో అక్కడ రాక్షసులు సూక్ష్మరూపంలో తిరుగుతుంటారు. ప్రయాణాలలో ఇటువంటి నియమాలు వర్తించవు. 

expand_less