కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: నవమి రా.6.19 కు తదుపరి దశమి 5 రా.8.18 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: చిత్త సా.5.26 కు తదుపరి స్వాతి 5 రా.8.00 కు
యోగం: శివ సా.7:35 కు తదుపరి సిద్ధ 5 సా.8:35 కు
కరణం: కౌలవ సా.4.32 కు తదుపరి తైతుల 5 తె.5.46 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:26-9:18 కు, మ. 12:46-1:38 కు
వర్జ్యం: రా.11.38-1.24 కు
అమృతకాలం: ఉ.09:38-11:26 కు
సూర్యోదయం: ఉ. 5:33 కు
సూర్యాస్తమయం: సా. 6:35 కు
🕉️ వారాహీ నవరాత్రులు 9వ రోజు🕉️
గురుబోధ:
మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల) లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలా గా ఆరాధించడం.
https://youtu.be/ECa8o_0ig1k?si=4OAb8QAD8iwAfB3i
PDF👉🏻 - https://srivaddipartipadmakar.org/stotram/sri-varahi-kavacham/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial