కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి తె. 4.40 కు తదుపరి చతుర్దశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మృగశిర తె. 4.21 కు తదుపరి ఆర్ద్ర
యోగం: గండ ఉ. 07.00 కు తదుపరి వృద్ధి
కరణం: వణిజ తె. 05.54 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.09 - 11.02 కు & మ. 03.25 - 04.17 కు
వర్జ్యం: ఉ. 10.10 - 11.45 కు
అమృతకాలం: రా. 7.26 - 9.00 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు
👉🕉️ మాసశివరాత్రి 🕉️👈
గురుబోధ:
ప్రదోషవేళ మాసశివరాత్రిరోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను అనుగ్రహిస్తుంది. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.
శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha