"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 03 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : చతుర్థి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹42ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : మఘ ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం : వజ్ర ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹07ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : విష్టి సాయంత్రం 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹51ని౹౹ నుండి 05గం౹౹43ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹13ని౹౹ నుండి06గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
స్నానం అయ్యాక ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలునే కట్టుకుని పూజ చేయడం, దీపారాధన చేయడం చేయరాదు. శుభ్రమైన మరొక దుస్తులు ధరించి మాత్రమే చేయాలని శాస్త్రం.