కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ ఉ.7.54 కు తదుపరి తదియ 3 ఉ.9.03 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.8.37 కు తదుపరి శ్రవణం 3 ఉ.10.24 కు
యోగం: విష్కంభ సా.4:59 కు తదుపరి ప్రీతి 3 సా.5:01 కు
కరణం: వణిజ రా.10:32 కు తదుపరి బవ 3 రా.12:03 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.10 - 11.02 కు, మ. 3.22 - 4.14 కు
వర్జ్యం: మ.12.55 - 2.38 కు
అమృతకాలం: రా. 12.21 - 02.06 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
🕉️యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ |
తస్య విస్తారితాబుద్ధిః తైలబిందురివాంభసి ||
ఎవరైతే అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారో, అక్కడున్న పండితులను పెద్దలను, సేవిస్తారో వారికి జ్ఞనం కలుగుతుంది. నీటిలో నూనె బొట్టు వేస్తే, ఆ జిడ్డు ఎలా వ్యాపిస్తుందో, తిరగడం వల్ల జ్ఞానం వ్యాపిస్తుంది. వారికి ఇహం తరువాత పరం రెండూ లభిస్తాయి. ముక్తి వచ్చి తీరుతుంది.
🕉️తీర్థయాత్రలు చేయడానికి తప్పక సమయం కేటాయించాలి. క్షేత్రాలను, మహాత్ములను దర్శించడం వల్ల మన పాపకర్మలు తొలగుతాయి.
https://youtu.be/7paiBrJuiFw?si=H0YSkYjzrvD6vVrW
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial