July 02 2024జులై 02 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి ఉ. 8.54 కు తదుపరి ద్వాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: భరణి ఉ. 6.18 కు తదుపరి కృత్తిక
యోగం: ధృతి ఉ. 11.17 కు తదుపరి శూల
కరణం: బాలవ ఉ. 08.42 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.24 - 09.16 కు & రా. 11.15 - 11.59 కు
వర్జ్యం: సా. 5.49 - 7.21 కు
అమృతకాలం: రా. 2.42 - 4.12 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.55 కు

👉🕉️ జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి (అపర ఏకాదశి) 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చెయ్యాలి.

గురుబోధ:
🕉️ ఈరోజు నారాయణుడిని లక్ష్మీదేవితో కలిపి పూజించాలి.
🕉️ లక్ష్మీదేవికి అపర అని పేరు. అపర అనగా భూలోక సుఖములు, పైలోక సుఖములు ఇచ్చునది, అంతకంటే ఉత్తమమైన జగన్మాత మరొకటి లేదు.
🕉️ మందార పుష్పములతో అపరాదేవిని పూజిస్తే అటువంటి వారికి సంపదలు లభిస్తాయి, మల్లె పువ్వుల వంటి తెల్లని పువ్వులతో పూజిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది, చామంతి పువ్వులతో లక్ష్మీనారాయణ అష్టోత్తరములతో పూజించినవారికి భూసంపద, గృహ సంపద, అన్ని సంపదలు కలుగుతాయి.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

expand_less